విశ్వాస పరీక్షకు మేమెప్పుడూ సిద్ధమే: జితు పట్వారీ

అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు మేమెప్పుడూ సిద్దమేనని కాంగ్రెస్‌ నేత జితు పట్వారీ స్పష్టం చేశారు. రేపు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జితు పట్వారీ మీడియాతో మాటాడారు. సీఎం కమల్‌నాథ్‌ ఈ విషయం ఇప్పటికే చెప్పారు. కిడ్నాప్‌నకు గురైన ఎమ్మెల్యేలను ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అసెంబ్లీ పాటించాల్సిందేనని అన్నారు. రేపు సాయంత్రం 5 గంటల్లోగా విశ్వాసపరీక్షను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.