పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టెన్త్ పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేస్తున్నాం. మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీలు అన్ని మూసివేయాలని అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు సహకరించాలని కోరుతున్నాం. ఈ నెల 25వ తేదీన ఉగాది పండగ సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని ప్రజల కోసం లైవ్ టెలికాస్ట్ చేస్తాం. నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి. కొరత సృష్టించే బ్లాక్ మార్కెట్‌గాళ్లను ఉపేక్షించం. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు పెంచాలని ఆదేశించాం. 200 మంది బంధువులకు మించకుండా రాత్రి 9 గంటల లోపే పెండ్లీలు ముగించాలని విజ్ఞప్తి చేశారు. 1165 మంది అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. కొంత మంది ఇంటికి వెళతామన్న వారిని పంపిస్తున్నాం. వారిపై కూడా నిఘా ఉంచుతామని తెలిపారు.