పేదలకు మంత్రి మల్లారెడ్డి నిత్యావసరాలు పంపిణీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లోని నిరుపేదలను, వలస కూలీలను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా నగరంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయిభవాని ఫంక్షన్‌హాల్‌లో పేదలకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు బియ్యం, గుడ్లు, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రణీత, వైస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ విజయలక్ష్మీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదేవిధంగా బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ వార్డులో బింగి జంగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను మంత్రి మల్లారెడ్డి పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ లక్ష్మి, మాజీ జడ్పీటీసీ సంజీవరెడ్డి, కొర్పొరేటర్లు పాల్గొన్నారు.